తరుచుగా అడిగే ప్రశ్నలు:
భారతీయ పౌరులు అయి, భారతదేశంలో నివసిస్తూ , మార్చి 31, 2024 నాటికి 18 ఏళ్ళ వయసు పైబడి, మానసిక శారీరక ఆరోగ్యాలు బాగున్న ఎవరైనా మాస్సె డైనాస్టార్ కాంటెస్ట్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎవరి తరఫునో వేరెవరో పోటీ చేయకూడదు. నియమ నిబంధనలని అనుసరించి పోటీదారు ఈ కాంటెస్ట్ లో ప్రవేశించగలరు. పోటీకి ఎంపిక చేస్తున్న సమయంలో మీరు అవసరమైన గుర్తింపు రుజులువు దాఖలు చేయాల్సి వుంటుంది.
MasseyFergusonIndia.com/DYNASTAR/season-3 కి లాగాన్ అవండి. ఈ ఫాంని చేరుకోడానికి మాస్సె డైనాస్టార్ రిజిస్ట్రేషన్ బ్యానర్ మీద క్లిక్ చేయండి. OTP ద్వారా తనిఖీ చేయడానికి మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి. మీరు అందజేసిన మొబైల్ నెంబర్ భారతదేశంలోని సర్వీస్ ప్రొవైడర్ వద్ద రిజిస్టర్ అయితేనే మేం మీతో సంబంధంలో ఉండగలుగుతాం అని దయచేసి గుర్తించండి. ఈ కాంటెస్ట్ కి సంబంధించిన అన్ని కమ్యూనికేషన్ ని ఈ నెంబర్ ద్వారా మాత్రమే నిర్వహిస్తారు. ఈ నెంబర్ ఎప్పుడూ యాక్టివ్ గా, చేరుకోగలిగేలా వుండేలా చూసుకోండి.
ఈ సీజన్‌లో మీరు మీ ఐడియాను ఏ Massey Ferguson ట్రాక్టర్‌పై అయినా అమలు చేయవచ్చు.
అవును! Season 3లో మీరు మీ ఐడియాను ఏ Massey Ferguson ట్రాక్టర్‌పైనా అమలు చేయవచ్చు.
చివరి తేదీ 31 మార్చి 2026, రాత్రి 12 గంటలు.
మీరు చివరి 30 మంది జాబితాలో ఉంటే, సమర్పించిన భావనలు/ఆలోచనలు/డిజైన్‌లను అభివృద్ధి చేయడానికి, సహ-అభివృద్ధి చేయడానికి లేదా మెరుగుపరచడానికి మీరు చేసిన అభ్యర్థనపై, కొన్ని షరతులకు లోబడి అవసరమైన అన్ని సహేతుకమైన సహాయాన్ని అందించడానికి TAFE లేదా మాస్సే ఫెర్గూసన్ ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు. ఫంక్షనల్ మోడల్‌లు, డిజైన్‌లు, మెరుగైన డిజైన్‌లు లేదా ఇంప్రూవైజ్డ్ మోడల్‌లుగా వారి ఆలోచనలను అభివృద్ధి చేయడానికి TAFE (లేదా దాని సాంకేతిక బృందం) నుండి సాంకేతిక సహాయం అభ్యర్థించిన లేదా స్వీకరించిన చోట, TAFE ఆ నిర్దిష్ట అవుట్‌పుట్‌లు/డిజైన్‌లు/మోడళ్లు/మెరుగైన మోడల్‌లకు ఏకైక యజమానిగా ఉంటుందని దయచేసి గమనించండి. ఈ శుద్ధి చేసిన వెర్షన్‌ల ప్రాథమిక డెవలపర్‌గా, ఫలిత నమూనాలు, డిజైన్‌లు మరియు అటువంటి సాంకేతిక మెరుగుదలలకు TAFE అన్ని యాజమాన్య హక్కులను కలిగి ఉంటుంది.
అవును, మీరు పాల్గొనవచ్చు. అయితే, ఈ ఆలోచన ప్రత్యేకంగా మాస్సే ఫెర్గూసన్ ట్రాక్టర్‌లో అమలు చేయబడాలి.
మాస్సె ఫెర్గూసన్ ఇండియా మరియు టఫె అన్ని ఫాంలని క్షుణ్ణంగా వివరంగా పరిశీలించి పాల్గొనే వారిని ఎంపిక చేస్తారు. మిమ్మల్ని రౌండ్ కి ఎంపిక చేస్తే, సంప్రదింపులకోసం మీరు అందచేసిన వివరాల (ఇమెయిల్ ఐడి/ఫోన్ నెంబర్) ఆధారంగా కంపెనీ నుంచి మీకు లాంఛనంగా సమాచారం అందుతుంది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల పేర్లని మేము, మాస్సె ఫెర్గూసన్ ఇండియా, టఫె సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్ లోనూ ప్రకటిస్తామని గమనించండి.
ఒక దరఖాస్తు ఫారం నింపడానికి కేవలం ఒక మొబైల్ నెంబర్ ని మాత్రమే ఉపయోగించాల్సి వుంటుంది. ఒకవేళ మీకు పలు వ్యాపార ఆలోచనలు వున్నట్టయితే, మీ పేరు మీద రిజిస్టర్ అయివున్న వేర్వేరు మొబైల్ నెంబర్ల నుంచి మీరు దాఖలు చేసుకోవచ్చు.
మీరు ఫామ్ లో పేర్కొన్న అన్ని తప్పనిసరి ఫీల్డ్‌లను (*) పూరించాలి, అది లేకుండా మీరు ఫామ్ ను సమర్పించలేరు. అంతే కాకుండా, మీరు మాకు ఎంత ఎక్కువ సమాచారం ఇస్తే, మేము మిమ్మల్ని బాగా తెలుసుకుంటాము మరియు మీ ఫామ్ ను మూల్యాంకనం చేస్తాము
అవును. మీరు కొత్త మొబైల్ నెంబర్ తో తిరిగి రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. కాంటెస్ట్ కి సంబంధించి అన్ని కమ్యూనికేషన్లని ఈ నెంబర్ తోనే నిర్వహిస్తారు. దయచేసి ఈ నెంబర్ యాక్టివ్ గా, అందుబాటులో వుండేలా చూసుకోండి.
మా టోల్ ఫ్రీ నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు లేదా corporate@tafe.com ద్వారా మాకు వ్రాయవచ్చు.
ఫాంలో ప్రతి పేజీలోనూ కొన్ని తప్పనిసరి ఫీల్డ్స్ (*) వుంటాయి. ఫాంని దాఖలు చేయడానికి, ఆ ఫీల్డ్స్ అన్నీ సంబంధిత సమాచారంతో పూర్తిగా నింపేలా చూసుకోండి. అలాగే, అక్షరాల పరిమితి (ఒకవేళ ప్రత్యేకంగా పేర్కొంటే)కి కట్టుబడి వుండేలా చూసుకోండి.
మీరు మాకు పంపిన వివరాలని, ఈ కాంటెస్ట్ కు సంబంధించి మీ వ్యాపారాన్ని మదింపు చేయడానికి కంపెనీ ఉపయోగిస్తుంది. మీరు పంపిన వివరాలని గోప్యంగా వుంచుతారు, వాటిని ఏ థర్డ్ పార్టీకి పంపడం జరగదు.
వ్యక్తిగత ఆడిషన్ రౌండ్ కు ఒకవేళ మిమ్మల్ని ఎంపిక చేసినట్టయితే, పాల్గొంటున్నవారు, భాగస్వామికి రైలు ప్రయాణ, వసతి ఖర్చులని కంపెనీయే భరిస్తుంది. అవసరమైన పత్రాలు, ఫోటోలు దాఖలు చేసిన తరవాత మాత్రమే మిమ్మల్ని ఆడిషన్ జరిగే ప్రదేశానికి అనుమతిస్తారు.
అన్ని ఎంట్రీలని, మాస్సె డైనాస్టార్ పోటీ పేజీలో అందుబాటులో వున్న ఫాంలోనే అప్ లోడ్ చేయాలి.
మాస్సె డైనాస్టార్' పోటీలో పాల్గొనడానికి ప్రవేశ రుసుమంటూ ఏదీ లేదు. పాల్గొనేవారికోసం ఈ పోటీ పూర్తిగా ఉచితం.
తప్పకుండా, మీరు ప్రొఫెషనల్ కెమేరా లేదా స్మార్ట్ ఫోన్, ఏ కెమెరాతోనైనా వీడియో షూట్ చేయొచ్చు. మార్గదర్శకాలకి అనుగుణంగా వున్నంతవరకూ మీరు ఎంట్రీలని దాఖలు చేయొచ్చు. నియమ నిబంధనలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పోటీకోసం దాఖలు చేసే డాక్యుమెంట్లు word లేదా PDF ఫార్మట్ లో వుండాలి. వీడియోలు కనీసం 720p రిజల్యూషన్లో వుండాలి. వీడియో రన్నింగ్ టైము 2 నిముషాల కన్నా మించకూడదు. వీడియోలు 100 MB కన్నా పెద్దగా వుండకూడదు. అవి కేవలం MP4 లేదా MOV ఫార్మట్ లోనే వుండాలి.
లేదు. ఇప్పటికే ప్రచురితం అయిన ఐడియాలను, ఈ పోటీలో ఎంట్రీగా దాఖలు చేయడానికి కుదరదు.
లేదు. ఒకసారి దాఖలు చేసిన వీడియోలు లేదా ఐడియాలని మార్చుకోవడం కుదరదు.
లేదు. ఏ వీడియోలోనూ వాటర్ మార్క్ లేదా కాపీరైట్ సమాచారం వుండకూడదు, అప్పుడు మాత్రమే పాల్గొంటున్నవారి గుర్తింపు జ్యూరీకి వెల్లడవకుండా వుంటుంది. వీటిపై నిర్ణయం తీసుకోవడం పూర్తిగా అనామకంగా జరుగతుంది, జ్యూరీకి ఇందులో పాల్గొంటున్నవారికి సంబంధించిన వివరాలు లేదా వ్యక్తిగత సమాచారం తెలిసే అవకాశం లేదు.
మీరు మీ ఐడియా తాలూకు బ్లూప్రింట్‌కు సంబంధించిన వర్కింగ్ మోడల్‌తో ముందుకు రావాలి. మాస్సే ఫెర్గూసన్ ఇండియా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది మరియు మీరు అర్హత సాధించిన తర్వాత తదుపరి ప్రక్రియ గురించి మీకు తెలియజేస్తుంది.
మీరు మీ బ్లూప్రింట్‌ను వీలైనంత వివరంగా తయారు చేయవచ్చు కానీ అది చక్కగా ఉండాలి, ఖచ్చితత్వంతో సమర్పించాలి.